Tuesday, September 10, 2024

పర్యాటక రంగంపై అవగాహన వుండాలి

Must Read

వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య

వరంగల్: పర్యాటక రంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు,విద్యార్థులకు చరిత్ర పై అవగాహన కల్పించడం అవసరం అని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని ఆదివారం నాడు ఖీలా వరంగల్ లో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్ ను వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా సంయుక్తంగా ప్రారంభించారు.కోటలో చింతల్ గ్రౌండ్ నుండి కోట లోపలి వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు.అనంతరం కోటలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధ్భుతమైన చారిత్రక సంపద వుందని అన్నారు.

ప్రతీ ఒక్కరూ మన చరిత్ర,సంస్కృతి నీ తెలుసుకోవాలి అని అన్నారు.కమీషనర్ షేక్ రిజ్వన్ భాషా మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని అన్నారు.అదే విధంగా ఈ రోజు ఎన్ఎస్ఎస్ డే కూడా కావడం విశేషం అని తెలిపారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం శివాజీ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్ చారిత్రక ప్రదేశాలను,పర్యాటక దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమం లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షడు రవీందర్ రెడ్డి,తహశీల్దార్ నాగేశ్వర రావు, ఎన్ ఏస్ ఏస్ కోఆర్డినేటర్ కే శ్రీనివాస్ రావు,కార్పొరేటర్లు ఊమా దమోదర్ యాదవ్,భోగి సువర్ణ సురేష్, మైదం రాజు, సగర్లా శ్రీనివాస్,గైడ్ రవి యాదవ్,పర్యాటక సిబ్బంది లోకేష్,ఖాదర్ పాషా,ఆర్కియాలజీ సిబ్బంది బాషా,టూరిజం కార్పొరేషన్ అజయ్ , స్తానికులు బెల్లంకొండ రమేష్,రావుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img