మారుతున్న కాలంలో విచిత్రమైన ప్రేమలు, పెండిండ్లు సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా జ రగడం సర్వసాధారణమైంది. తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన జంగిటి కళ్యాణ్ కుమార్‌కు మూడేళ్ల కింద టిక్‌టాక్ ద్వారా విశాఖపట్నంకు చెందిన నిత్యశ్రీ పరిచయం అయింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ప్రేమకథ మధ్యలో కడప జిల్లాకు చెందిన విమల అనే ఓ మహిళ కళ్యాణ్ జీవితంలోకి ఎంటర్ అయింది. తొమ్మిది నెలలుగా ఆమెతో ప్రేమ వ్యవహారం నడుపుతూ మూడు నె లల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి ప్రియురాలు నిత్యశ్రీ యువకుడి తల్లిదండ్రులని కలిసి తన ఆవేదనను వెళ్లబుచ్చింది. కళ్యాణ్ లేనిదే తన జీవితం వ్యర్థం అం టూ పది రోజులుగా గాలించి కడపలో ఉంటున్న ప్రియుడిని కలిసి నిలదీసింది. నేరుగా యువకుడి భార్యతో మాట్లాడి అంతా కలిసి ఉందామని చెప్పింది. మొదటి భార్యతోపాటు కళ్యాణ్ తల్లిదండ్రులు కూడా ఇందుకు అంగీకరించారు. దీంతో బుధవారం సాయంత్రం డక్కిలి మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో కళ్యాణ్, నిత్యశ్రీలకు భార్య విమల సమక్షంలో తల్లిదండ్రులు మరో పెళ్లి చేసి ప్రేమకథకు సుఖాంతం పలికారు. నేటి కాలంలో యువత కోరికలు, ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ సంఘటన రుజువు చేసిందని అందరిలో చర్చనీయాంశమైంది. పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
Previous article
Next article
Latest News