Tuesday, June 18, 2024

ఈ కోర్సుల్లో చేరితే కొలువు ప‌క్కా !

Must Read
  • టెన్త్‌, ఇంట‌ర్‌తోనే ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు
  • పారామెడిక‌ల్ కోర్సుల‌కు పెరుగుతున్న డిమాండ్‌
  • ఎంజీఎం (న‌ర్సింగ్‌) ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ క‌ళాశాలలో ప్రారంభ‌మైన అడ్మిష‌న్లు

వైద్య రంగంలో వృత్తి శిక్షణ కోర్సులుగా పేర్కొనే పారామెడికల్ కోర్సులకు ఇటీవల కాలంలో డిమాండ్ పె రుగుతోంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేసే వీలుండడంతో అభ్యర్థులు ఈ కోర్సులపై మ‌క్కువ చూపుతున్నారు. వైద్య రంగంలో సేవలు అందించేందుకు సులువైన మార్గం కావడంతో ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. పదో తరగతితోనే పారామెడికల్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ఇంటర్ అర్హతతో చేసే కోర్సులకు మంచి డిమాండ్ నెలకొంది. కరోనా పరిణామాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో పారామెడికల్ సిబ్బంది నియామకాలు చేపడుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో పారామెడిక‌ల్ కోర్సుల‌వైపు విద్యార్థులు ఆక‌ర్షితుల‌వు తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ‌, పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల కోసం వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని ఎంజీ ఎం (న‌ర్సింగ్‌) ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ క‌ళాశాల అత్యాధునిక వ‌సతులు, ఆధునిక లాబోరెట‌రీ సౌక‌ర్యంతో పారామెడిక‌ల్ కోర్సులు అందుబాటులో ఉంచింది. త‌మ క‌ళాశాల‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు వం ద‌శాతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నార‌ని అంటున్నారు ఎంజీఎం (న‌ర్సింగ్‌) ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఈర మ‌హేంద‌ర్‌.

ఫుల్ డిమాండ్‌

పారామెడికల్ నిపుణులకు మనదేశంలోనే కాకుండా అమెరికా, యునైటెడ్ ఎమిరేట్స్, యూకే, కెనడా త దితర దేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రెండు రంగాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఆసుపత్రులు, హెల్త్ డిపార్ట్మెంట్‌, క్లినిక్‌లు ఆకర్ష‌ణీయ‌మైన వేతన ప్యాకేజీలు ఇచ్చి విధుల్లోకి తీసుకుంటున్నాయి. ఆయా సంస్థను బట్టి నెలకు రూ. 10 వేల నుంచి 25 వేల వరకు వేతనం అందిస్తున్నాయి. ఈ రంగంలో అనుభవం కీలకం కాబట్టి అనుభవం పెరిగే కొద్ది వేతనం కూడా భారీగా పెరుగుతుంది. పారామెడికల్ స్ట్రీమ్‌లలో ఏదైనా ప్రాథమిక కోర్సు పూర్తి చేసిన తర్వాత నర్సింగ్ హోమ్, హాస్పిటల్, క్లినిక్‌, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లతో పాటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్లుగా ఉద్యోగం చే యవచ్చు. అంతే కాకుండా స్వంతంగా లేబొరేటరీలు, క్లినిక్‌లను తెరవవచ్చు.

మెండుగా ఉద్యోగ అవ‌కాశాలు
ఎంజీఎం ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఈర మ‌హేంద‌ర్‌

వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని ఎంజీఎం ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ క‌ళాశాలలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీ హెచ్‌డ‌బ్ల్యూ (ఫిమేల్), డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్‌టీ) అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా రెండు సంవత్సరాల కాల పరిమితి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగంలో వంద‌శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీహెచ్‌డ‌బ్ల్యూ (ఏఎన్ఎం) కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. మా క‌ళాశాల‌లో కోర్సు పూర్తి చేసిన అనేక మంది వివిధ ప్రైవేట్‌, కార్పొరేట్ హాస్పిటళ్ల‌తోపాటు నర్సింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినవాళ్లు లాబోరేట‌రీల్లో ఉద్యోగాలు పొంద‌వ‌చ్చు. సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కోర్స్ చేసినవారు వ్యవసాయ ఆధారిత డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు పొంద‌వ‌చ్చు. అదే విధంగా ఎలక్ట్రికల్ టెక్నీషియన్ చేసినవారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో జూనియర్ లైన్‌మెన్‌కు అర్హ‌త సాధించ‌డ‌మేగాక ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌గా రాణించ‌వ‌చ్చు. మొత్తంగా టెన్త్‌, ఇంట‌ర్ అర్హ‌త‌తోనే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కొలువుల‌తోపాటు మెండుగా ఉపాధి అవ‌కాశాలు పొందేందుకు పారామెడిక‌ల్ కోర్సులు బాట‌లు వేస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం మా క‌ళాశాల‌లో అడ్మిష‌న్లు ప్రారంభ మ‌య్యాయి. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు 9059729000, 7989085534 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

 

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img