Tuesday, September 10, 2024

నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఒక బ్రోక‌ర్‌.. అస‌మ‌ర్థుడు

Must Read
  • యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నా..
  • కొత్త‌గా వ‌చ్చిన వారికీ టికెట్లు ఇచ్చారు.. నాకే ఇవ్వ‌లేదు
  • పార్టీ కోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టా..
  • ఈ ఎన్నిక‌ల్లో విన‌య్‌భాస్క‌ర్‌, నాకు మ‌ధ్యే పోటీ
  • ఎల్లుండి నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా..
  • డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి
  • అనుచ‌రుల‌తో స‌మావేశం

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : కాంగ్రెస్ అధిష్ఠానంపై డీసీసీబీ మాజీ చైర్మ‌న్‌ జంగా రాఘవ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానంటూ త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌వ‌క‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన జంగా రాఘ‌వ‌రెడ్డికి నిరాశ ఎదురైంది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం త‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. ప్రజలు త‌న‌ను గెలిపించ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు. కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశశ్వినికి టికెట్లు ఇచ్చారు… నాకు మాత్రం ఇవ్వలేదు.. అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ స‌మావేశాల‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేశాన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అవ‌కాశం పొందిన నాయిని రాజేందర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఒక బ్రోకర్.. అసమర్థుడు.. అంటూ ఆరోపించారు. కేయూ భూములు అమ్ముకున్న నాయినికి టికెట్ ఇచ్చారని, ఏ సర్వే ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కు ఓటెయ్యడానికి ప్రజలు సిద్దంగా వున్నా.. నాయకులు సిద్ధంగా లేరని అన్నారు. త‌న‌పై కుట్ర చేసి, ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు… స్వలాభం కోసం పార్టీని నాశనం చేయొద్దు.. కాంగ్రెస్‌ను మోసం చేయలేదని, ప్రజల్ని మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద నేను ప్రమాణం చేస్తా.. నాయిని సిద్ధమా…? అంటూ స‌వాల్ విసిరారు. త‌న‌ కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాన‌ని, ఆరు నియోజకవర్గాల్లో త‌న‌ అభ్యర్థులు ఉంటార‌ని, అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటాన‌ని, వరంగల్ పశ్చిమలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి వినయ్ భాస్కర్‌కు త‌న‌కు మ‌ధ్యే పోటీ అని స్ప‌ష్టం చేశారు. ఎల్లుండి త‌న‌ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాన‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img