Monday, July 22, 2024

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ – 1 ఐజీ ఏ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న పీ.వీ.ఎస్ భవాని సేన్ , పాత కాళేశ్వరం పోలీస్ స్టేషన్ బిల్డింగ్లో 2 అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అదే పాత కాళే శ్వరం పిఎస్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో మహిళ హెడ్ కానిస్టేబుల్ నివాసం ఉంటున్నారు. పాత కాళేశ్వరం పోలీస్ స్టేషన్ బిల్డింగ్ అనేది లక్ష్మీ పంప్ హౌస్ వద్ద ఉంది. 15 -6- 2024 రోజున దాదాపు రాత్రి 10 గంటలకు బాధిత మహిళా హెడ్ కానిస్టేబుల్ తన విధి నిర్వహణ ముగించుకొని తన నివాసమైన పాత కాలేశ్వరం పోలీస్ స్టేషన్లోని తన ఇంట్లోకి చేరుకొని నిద్రకు ఉపక్రమించింది. అదే రోజు సుమారు రాత్రి ఒంటిగంట సమయంలో అనగా 16- 6- 2024 అదే భవనంలో 2వ అంతస్తులో నివాసం ఉంటున్న కాళేశ్వరం ఎస్సై పి.వి.ఎస్ భవాని సేన్ అక్రమంగా కిటికీలోంచి మహిళా హెడ్ కానిస్టేబుల్ గదిలోకి చొరబడి, బాధిత మహిళ హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి మేల్కొన్న బాధితురాలు ఎస్సైని ప్రతిఘటించింది, అయినప్పటికీ వినకుండా తన సర్వీస్ రివాల్వర్ తో బాధితురాలిని బెదిరించి ఆమెను గాయపరిచి, అత్యాచారానికి ఎస్సై పాల్పడి, అదే రోజు రాత్రి 2:15 నిమిషాలకు బాధితురాలి గది నుంచి బయటికి వెళుతూ అత్యాచార విషయం బయటకు చెబితే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధిత మహిళా హెడ్ కానిస్టేబుల్ ను ఎస్సై భవానిసేన్ బెదిరించాడు. అలాగే సుమారు 20 రోజుల క్రితం మహిళా హెడ్ కానిస్టేబుతో ఎలాగైనా శారీరకంగా కలవాలని వక్రబుద్ధితో రాత్రి 10 గంటలకు పాత కాళేశ్వరం పి.ఎస్ బిల్డింగ్ లో బాధిత మహిళా కానిస్టేబుల్ కు ఎస్సై భవాని సేన్ ఫోన్ చేసి తన కాలు స్లిప్ అయ్యి జారిపడ్డానని, కాలికి గాయం అయిందని, తన గదికి రావాలని అభ్యర్థించగా వెంటనే బాధితురాలు ఎస్ఐ గదిలోకి వెళ్ళింది. దీంతో ఇదే అదునుగా భావించిన ఎస్సై ఆమెను లైంగికంగా ప్రలోభ పెట్టడంతో, ఎస్సై ఉద్దేశాన్ని గుర్తించిన బాధితురాలు అతని తోసివేసి తన గదిలోకి పరిగెట్టుకుంటూ వెళ్లి డోర్లు వేసుకుంది. అనంతరం ఈ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కాళేశ్వరం గ్రామంలో అద్దెగది కోసం వెతుకుతున్న క్రమంలో క్రమంలో ఈ నెల 15- 6 -2024 రాత్రి ఒంటిగంటకు అనగా 16- 6 – 2024 రోజున బాధితురాలుపై ఎస్సై భవాని సేన్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

ఈ ఘటనపై బాధిత మహిళ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలిసు స్టేషన్ లో U/S 449, 376 (2))(a) (b) 324, ,506, ఐ.పి.సి కింద ఎస్ఐకి వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా భూపాలపల్లి SDPO సంపత్ రావును జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే నియమించారు. అత్యాచార ఘటనపై భూపాలపల్లి SDPO విచారణ జరిపగా, ఆరోపణలు నిజమని తేలడంతో బాధిత‌ మహిళను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే ఎస్సై భవాని సేన్ దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ పది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న డిఎస్పి బృందం, 19 -6-2024 బుధవారం ఉదయం కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను అరెస్టు చేసి, భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ అడిషనల్ JFCM కోర్టు ఎదుట హాజరు పరిచారు.

అలాగే నిందితుడు భవాని సేన్ ఇంతకుముందు 22- 6- 2002న ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా పని చేస్తున్న సమయంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతికి మెటీరియల్ ఇప్పిస్తానని ఆఫీసుకు పిలిపించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడగా, యువతి ఫిర్యాదు మేరకు అదే రెబ్బన పి.ఎస్ లో 354 -D IPC సెక్షన్ ప్రకారం కేసు నమోదు అవ్వగా ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఎస్సై భవాని సేన్ ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు ఆసిఫాబాద్ కోర్టులో ట్రయల్ ఉంది.

కాళేశ్వరం మహిళా హెడ్ కానిస్టేబుల్ అత్యాచార ఘటనపై చట్టపరమైన చర్యలకై మల్టీజోన్ – 1 ఐజి ఏ.వి రంగనాథ్ ఐపీఎస్‌కు ఎస్పీ కిరణ్ ఖరే సమగ్ర నివేదిక పంపగా, సదరు ఎస్ఐ తన హోదాను అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్.ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా వుండడంతో ఎస్ఐపై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ నపై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా మల్టీ 1జోన్ ఐజీ ఏ. వి. రంగనాథ్ వెల్లడించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img