Saturday, September 7, 2024

‘కేజీయఫ్‌ 2’ టాక్‌ ఎలా ఉందంటే..

Must Read

కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో హీరోగా యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల కింది వరకు య‌ష్‌.. కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో. రాఖీ భాయ్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో..? కేజీయఫ్ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘కేజీఎఫ్ చాపర్ట్ 2’ కోసం యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నేడు (ఏప్రిల్‌ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓ కన్నడ సినిమా ఇన్ని స్క్రీన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్ అని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక‌.. కేజీయఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కనీవినీ ఎరగని బిజనెస్ చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు.

హీరో ఇంట్రడక్షన్ .. ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని ట్వీట్‌ చేస్తున్నారు. అదేవిధంగా బయట ప్రచారం చేసినంతగా కేజీయఫ్‌ 2 లేదని, రెగ్యులర్‌ మాస్‌ మూవీలాగే ఉంద‌ని, కేజీయఫ్‌ 2 మ్యాజిక్‌ని రీక్రియేట్‌ చేయడంలో ప్రశాంత్‌ నీల్‌ విఫలమయ్యాడని చెబుతున్నారు. కేజీఫ్ 2 తో మరోసారి యశ్ యాక్షన్‌తో అదరగొట్టేసినట్టు చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టడం పక్కా అని అంటున్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img