Monday, September 16, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Must Read

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రత సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డా. అశ్వని తానాజీ వాకాడ తో పాటు ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్తు, మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి, అగ్నిమాపక, రోడ్డు రవాణా కు చెందిన అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుగా ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ అధిగమించేందుకు ప్రధానంగా వున్న సమస్యలపై ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పద్దతి అధికారులకు వివరించారు. ఇందులో ప్రధానంగా నగరంలో ఏడు ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటు, రోడ్లపై పనిచేయని కరెంటు స్థంబాల తొలగింపు, పుట్టినరోజు, ఫుట్ పాట్ ల పై ఏర్పాటు చేసిన వ్యాపారాస్తులు ఏర్పాటు ప్రచార బోర్ధులతో పాటు, నగరంలో ఇరువైకి పైగా ప్రాంతాల్లో ఫుట్ పాట్ తో ప్రధాన రోడ్లను ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారాలకు తొలగింపు, వ్యాపార సముదాయల్లో సెల్లారులో వ్యాపారం నిర్వహించకుండా కేవలం వాహనాల పార్కింగ్ కోసం వినయోగించేలా చర్యలు, పది ప్రధాన జంక్షన్లలో వున్న పాత సిగ్నల్స్ తొలగించడం, అదే విధంగా కొత్తగా రద్దీగా ఉంటున్న మరో తొమ్మిది జంక్షన్లలో నూతన సిగ్నల్స్ ఏర్పాటు, ప్రమాదంగా మారిన రోడ్ల పై పడిన గుంటల మరమ్మత్తులు, సిగ్నల్స్ పై వున్న తీగల తొలగించాల్సిందిగా పోలీస్ కమిషనర్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ సూచించారు. పోలీస్ కమిషనర్ చేసిన సూచనలపై ఇరువురు కలెక్టర్లు స్పందిస్తూ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను అదేశించారు. అలాగే ట్రై సిటీ ప్రధాన రోడ్డు మార్గం డివైడర్ల ఎత్తును పెంచలసిందిగా ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు డివైడర్ల ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోబడుతాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం శ్రమించే ట్రాఫిక్ పోలీసులు వారి సూచనల మేరకు చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు క్షేమంగా, త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు పరిశీలించిన అధికారులు, వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు హనుమకొండ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు అశోక జంక్షన్ వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటుతోపాటు, అదాలత్ జంక్షన్ లో సిగ్నల్సపై వున్న తీగలను పరిశీలించారు.

ఈ సమావేశంలో డీసీపీ లు రవీందర్, షేక్ సలీమా,డి టి. ఓ పుప్పాల శ్రీనివాస్, ఏసీపీ లు జితేందర్ రెడ్డి, తిరుమల్, దేవేందర్ రెడ్డి, నందిరామ్ నాయక్, తో పాటు ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్. బి, విద్యుత్తు, అగ్ని మాపక విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img