Saturday, September 7, 2024

రైతుల‌కు తిరిగి రుణాలు ఇవ్వాలి: క‌లెక్ట‌ర్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: జులై నెలాఖరులోగా మొదటి విడత రుణమాఫీ పొందిన రైతులకు రెన్యువల్ చేసి తిరిగి రుణాలు ఇవ్వాల్సిందిగా అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్స్ తో రుణమాఫీపై బ్యాంకులవారీగా రుణమాఫీ నిధులు విడుదల, పంట రుణాల రెన్యువల్ పై సమీక్ష నిర్వహించారు .ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు రైతులకు సమాచారం ఇచ్చి బ్యాంకులు దగ్గరకు వెళ్లి రెన్యువల్ చేసుకునేట్లు చూడవలసిందిగా చెప్పారు. మండల పరిధిలో ఫిర్యాదుల కమిటీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్లు వారి వద్దకు వచ్చే ఫిరాధిదారుల వివరాలను ప్రతిరోజు కమిటీలకు పంపవలసిందిగా సూచించారు. జిల్లా స్థాయిలో రోజు వారి ఫిర్యాదుల వివరాలను సమీక్షించవలసిందిగా జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. బ్యాంకు శాఖ లు అన్నింటిలో ఫిర్యాదు కమిటీలు వివరాలను బ్యానర్ రూపంలో బ్యాంకుల దగ్గర ప్రదర్శించవలసిందిగా కోరారు. రుణమాఫీ పొందని రైతులను ఆందోళన చెందకుండా సమాధాన పరిచాల్సిన బాధ్యత బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, సహాయ సంచాలకులు దామోదర్ రెడ్డి, ఎల్ డి ఎం శ్రీనివాస్,వివిధ బాంకుల అధికారులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img