Saturday, July 27, 2024

మేడారంలో హెలీ రైడ్, ప్యారా సెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూన్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీ రైడ్, ప్యారా సెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూన్ ను ఏర్పాటు చేస్తున్నది. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ తెలిపారు. బెంగుళూరు కు చెందిన తుంబి ఎవియేషన్ సంస్థ హెలీ కాప్టర్ తో పాటు రాజస్థాన్ కు చెందిన ప్రైజెలైన్ ఆధ్వర్యం లో విస్సా ఫౌండేషన్ వారి సహకారంతో అడ్వెంచర్ హాట్ ఎయిర్ బెలూన్, ప్యారా సెయిలింగ్ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేస్తున్నది. హెలీ రైడ్ కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ గ్రౌండ్ నుండి మేడారం వరకు ప్రయాణానికి గాను(up and down) ఒక్కొక్కరికి రూ. 19,999 గా ఛార్జ్ చేస్తారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ. 3700 ఛార్జ్ చేస్తారు.

మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ములుగు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. హెలీ రైడ్ టికెట్ బుకింగ్, ప్యారా సెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూన్ లో మేడారం అందాలు వీక్షించాలంటే, ఇతర వివరాల కోసం 9400399999, 9880505905, 8121716076, 9866919131ఫోన్ లో లేదా info@helitaxii.com,నేరుగా మేడారంలోని హరిత హోటల్ (సెక్టార్ 14) రిసెప్షన్ కౌంటర్‌లో కూడా సంప్రదించవచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img