Sunday, September 8, 2024

మడిపల్లి గ్రామంలో నిట్ వరంగల్ ఆధ్వ‌ర్యంలో వైద్య శిబిరం

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ : దేశంలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థ నిట్ వరంగల్ ఆధ్వ‌ర్యంలో ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ మండ‌లం మడిపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు నిట్ వరంగల్ ఉన్నత్ భారత్ అభియాన్ సమన్వయకులు ప్రొఫెసర్ ఎం.హీరాలాల్ తెలిపారు. దేశ సంక్షేమంలో భాగంగా పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందేలా ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఐటి వరంగల్ పరిశోధక విద్యార్థి వినోద్ లోక్ నాయక్ ఆధ్వ‌ర్యంలో ప్రత్యేకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో ఏడుగురు డాక్టర్ల బృందం 426 మందిని పరీక్షించి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్లు అందించినట్లు ప్రొఫెసర్ ఎం. హీరాలల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిట్ వరంగల్ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ కార్తీక్, ప్రొఫెసర్ సుబ్బారెడ్డి, ప్రొఫెస‌ర్‌ సుమంత్, డాక్టర్ రంగిలాల్, డాక్టర్ రహిలా తన్వీర్, డాక్టర్ సుమన్, సూపర్ వైజ‌ర్లు యాకస్వామి, వరమ్మ, సరోజ, నిట్ సిబ్బంది సుధాకర్, ఆశ వర్కర్లు కవిత, మహేశ్వరి, లక్ష్మి, స్రవంతి, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img