Monday, September 16, 2024

న‌ర్సంపేట జిల్లా ఆస్ప‌త్రిలో ఆగస్టు 1 నుండి వైద్య సేవలు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ ( నర్సంపేట) 22 జూలై 2024: నర్సంపేట జిల్లా ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మణం పూర్తయినందున ఆగస్టు 1 నుండి ప్రజలకు వైద్య సేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి Vనర్సంపేటలో 250 పడకల జిల్లా ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కళాశాల ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇంకను మిగిలియున్న ఫినిషింగ్ పనులలో వేగం పెంచి జులై 31 లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అన్నారు. నర్సంపేట జిల్లా ఆసుపత్రికి అవసరమైన మొత్తం ఎక్విప్మెంట్, ఫర్నిచర్ త్వరితంగా సమకూర్చు కొవాలన్నారు. సమీపంలో వెళుతున్న మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా ఆసుపత్రికు మంచినీటి సరఫరా కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రొఫెసర్ రాంకుమార్ రెడ్డి పర్యవేక్షణలో సారధ్యంలో ఏడు కమిటీలను నియమించి కేటాయించిన ఆయా పనులను సకాలంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షిస్తూ ఎప్పటికపుడు నివేదించాలని అన్నారు. నర్సంపేట ప్రాంత చుట్టుప్రక్కల గ్రామాల్లో నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభం పై ఆశా వర్కర్ల, పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రచారం కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపల్ కిషన్, టిజిఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, బ్యాంక్ మేనేజర్ రాజు, నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ గోపాల్, మిషన్ భగీరథ ఈఈ వెంకట్రామణ రెడ్డి, మెటర్నిటీ హాస్పిటల్ పిఓ పద్మశ్రీ అసోసియేట్ ప్రొఫెసర్లు రమేష్, ఉషారాణి, కలెక్టరేట్ పర్యవేక్షకులు విశ్వ నారాయణ, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img