Friday, July 26, 2024

నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్ర‌భుత్వ సంక‌ల్పం

Must Read
  • వృత్తి నైపుణ్యాన్ని బట్టి జీతాలు పెరుగుతాయి
  • త్వరలోనే అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు
  • వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరు
  • రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • హన్మకొండలో మెగా జాబ్ మేళా ప్రారంభం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో హ‌న్మ‌కొండ పబ్లిక్ గార్డెన్స్ లోని నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఇప్పటికే ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించిందన్నారు. ప్రైవేటు కంపెనీలు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరని.. నిజాయితీగా పనిచేస్తారని.. ముక్కుసూటిగా మాట్లాడుతారని అన్నారు. ఎవరికైనా ఒకేసారి గుర్తింపు రాదని.. తమ వృత్తి నైపుణ్యాన్ని బట్టి జీతాలు పెరుగుతాయని చెప్పారు.

మూడేళ్ల క్రితం తొర్రూరులో జాబ్ మేళా నిర్వహిస్తే.. 1500 మంది ఎంపిక అయితే.. 1000 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారని అన్నారు. గతంలో ఉద్యోగాల్లో చేరిన వారిలో చాలా మంది ఇప్పుడు తమ స్కిల్స్ తో లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఆయ‌న చెప్పారు. కాగా, ఈ మేగా జాబ్ మేళాలో 30కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img