Saturday, July 27, 2024

మంత్రి స‌త్య‌వ‌తికి పితృవియోగం

Must Read

అక్షరశక్తి, మ‌హ‌బూబాబాద్‌: రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ మృతిచెందారు. అనారోగ్యంతో గురువారం తెల్ల‌వారుజామున కురవి మండలం పెద్దతండాలో క‌న్నుమూశారు. తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్య‌త‌లు నిర్వహిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్ హుటాహుటిన పెద్దతండాకు బయలుదేరి వెళ్లారు. లింగ్యానాయక్ మృతదేహాన్ని చూసి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. తండ్రితో త‌నకున్న జ్ఞాన‌ప‌కాల‌ను నెమ‌రువేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు.

మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు మాలోత్ కవిత, మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్‌, జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభిన‌వ్‌తోపాటు టీఆర్ఎస్ నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు లింగ్యానాయక్ మృతదేహం వ‌ద్ద నివాళుల‌ర్పించి మంత్రి స‌త్య‌వ‌తిని ప‌రామ‌ర్శించారు.

సీఎం కేసీఆర్ సంతాపం

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతిరాథోడ్ ను ఫోన్లో సీఎం కేసీఆర్ పరామర్శించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌

పితృవియోగం పొందిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్‌ మృతి పట్ల ఎర్రబెల్లి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img