అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ ఏనుమాము వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల మోసాలపై మిర్చిరైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజరకం మిర్చి రూ.17వేల ధర నిర్ణయించి, కేవలం రూ.14వేలకు మాత్రమే కొనుగోలు చేయడంపై మండిపడ్డారు. రైతులందరూ మార్కోట్లో సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్ గేట్ ముందు ధర్నా చేశారు. మిర్చి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేసిన అనంతరం ప్రధాన కార్యాలయం ముందు నిరసన ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Previous article
Next article
Latest News