Saturday, July 27, 2024

బీఆర్ఎస్ మేనిఫెస్టో ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తేలిపోయాయి..

Must Read
  • ప‌ర‌క‌ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
  • నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం
    అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : బీఆర్ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు డమ్మీ అయిపో యాయని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి చల్లా ధర్మారెడ్డి తెలియజేశారు. శుక్రవారం గీసుగొండ మండలం కొమ్మాల, విశ్వనాధపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌ను క‌లిసి కారు గుర్తుకు వేటేసి మ‌రోమారు బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.
    ప్రచారానికి వచ్చిన చల్లా ధర్మారెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు మంగళహారలతో, డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు.
    అనంతరం చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని, కేసీఆర్ భరోసాలో పొందుపరిచిన 17 హామీలనే ప్రజలు నమ్ముతున్నారన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్‌ అధికారంలోకి రాగానే రూ. 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందుతుందని, ఆసరా పింఛన్ రూ. 5000కు పెరుగుతుందని, వికలాంగుల పింఛన్ రూ. 6000కు పెంచుతామని, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రూ. 15 లక్షల రూపాయలకు పెంచుతా మన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందడంతో పాటు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 అందుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మూడు గంటలు కరెంటు వస్తుందని, కారు గుర్తుకు ఓటేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ జెండా రెపరెపలాడేలా సహకరించాల‌ని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img