అక్షరశక్తి, వరంగల్ తూర్పు : రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు పరమత సహనాన్ని కలిగి ఉండి, సోదరభావంతో మెలగాలని, సమాజంలో శాంతిని నెలకొల్పాలని అన్నారు. ఖిలా వరంగల్, తూర్పు కోట, పడమర కోట, ఉర్సు దర్గా, ఎల్‌బీ నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు ఉన్నారు.