Monday, September 9, 2024

సంచ‌ల‌నాల పీపీ… మోకిల స‌త్య‌నారాయ‌ణ అరుదైన రికార్డు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనాలు సృష్టించిన అనేక కేసుల్లో తన వాదనలు వినిపించి నిందితులకు కఠిన శిక్షలు ప‌డేలా కృషిచేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాసిక్యూషన్ డి ప్యూటీ డైరెక్టర్, ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారాయణకు రక్షణగా ప్రభుత్వం ఇద్దరు గ న్‌మెన్ల‌ను నియమించింది. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వుల మేర‌కు గురువారం విధుల్లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనాలు సృష్టించిన అనేక కేసుల్లో మోకిల తన వాదనలు వినిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేశారు. మరో మూడు సంచలన కేసులను ప్ర‌స్తుతం వాదిస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఆయనకు ప్రమాదం పొంచి ఉందని భావించిన ప్రభుత్వం రక్షణగా ఇద్దరు గ న్‌మెన్ల‌ను నియమించింది. జిల్లాలో తల్లి పక్కన పడుకున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయి త్యానికి ఒడిగట్టి హతమార్చిన కేసు, వ‌రంగ‌ల్ గొర్రెకుంట‌లో 9 మందిని చంపేసి బావిలో పడేసిన మృత్యు బావి కేసులో నిందితులకు కోర్టు ఉరి శిక్ష వేసేలా సత్యనారాయణ త‌న వాదన వినిపించారు. అంతుగాక ములుగు జిల్లా కోర్టులో న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసుకు, వరంగల్ జిల్లా కోర్టులో పూజారి హత్య కేసుకు, మహబూబాబాద్ జిల్లా కోర్టులో విలేక‌రి కుమారుడుని డబ్బుల కోసం అపహరించి హతమార్చిన కేసులకు సంబంధించి ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. ఓ పీపీకి ప్రభుత్వం గన్‌మెన్ల‌ను నియమించడం ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img