Thursday, September 19, 2024

ఢిల్లీ వరదల్లో మృతి చెందిన విద్యార్థుల పట్ల రాజ్యసభలో ప్రస్తావించిన – ఎంపీ వద్దిరాజు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఐఎఏస్ సాధించాలనే ఉన్నత లక్ష్యంతో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు ఆశావహులు అకాల మృత్యువుకు లోను కావడం పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యా సోని, నవీన్ దల్వై న్ (కేరళ), శ్రేయా యాదవ్ (ఉత్తర ప్రదేశ్)లు ఐఎఏస్ సాధించాలనే దృఢ సంకల్పంతో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో జలసమాధి కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. రాజ్యసభలో సోమవారం ఎంపీ రవిచంద్ర ప్రత్యేక ప్రస్తావన తెస్తూ పిల్లల ఉజ్వల భవిష్యత్తునకు వారి తల్లిదండ్రులు ఐఎఏస్ కోచింగ్ కోసం ఢిల్లీకి పంపితే భారీ వాన వల్ల అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో వరద ముంచెత్త‌డంతో వ‌ర‌ద‌లో చిక్కుకుని ముగ్గురు నిండూ ప్రాణాలు కోల్పడం పట్ల బీఆర్ఎస్ పక్షాన సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యార్థులు, యువతకు ఉన్నత చదువులు అందుబాటులో ఉండాలనే సదాశయంతో తమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద సంఖ్యలో గురుకులాలు, 33 జిల్లాలలో వైద్య, నర్సింగ్ కాలేజీలు నెలకొల్పారని, విదేశాలలో విద్యనభ్యసించే యువతకు 20లక్షల రూపాయలు ఉచితంగా సాయమందించడాని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. తాన్యా తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్నారని, ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్ తదితర ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారని, అండగా ఉంటామని హామీనిచ్చారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు, తప్పిదాలు భవిష్యత్తులో చోటు చేసుకోవద్దని మనమందరం కోరుకుందామని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ వద్దిరాజు కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img