Friday, July 26, 2024

అరకొర వసతులు -చేతులు దులుపుకున్న అధికారులు

Must Read

—–కనీసం స్పందించని ఏపీవో, ఎంపిడిఓ

—-వీరిపై చర్యలకు కూలీల డిమాండ్

——పీడీ -డిఆర్ డిఏ, స్పందించాలని కూలీల డిమాండ్

అక్షర శక్తి ,హసన్ పర్తి::హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస అవసరాలు లేవని మొత్తుకున్నా అధికారులు స్పందించడం లేదని కూలీలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కూలీల పని చేసే వద్ద కనీస సౌకర్యాలైన నీడ,నీటి వసతి, ప్రధమ చికిత్స కిట్టులు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలే ఎండా కాలం, మండుటెండల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు పనుల వద్ద టెంటు( షెడ్) ఏర్పాటు చేయడం లేదని కూలీలు తెలిపారు. వందల మంది కూలీలు పని చేసే చోటులో ఓ పది మందికి సరిపోయే,కనీసం 5 గంటలు పని చేయాలని నిబంధనలు పెడుతూ, ఒక గ్రూపుకి 10మంది ఉండగా ముగ్గురు కలిసి ఒక ట్రాక్టర్ ట్రిప్పు పోయాలని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడం ఏంటని కూలీలు ప్రశ్నిస్తున్నారు. తెలిపారు.కూలీల పట్ల ఫీల్డ్ అసిస్టెంట్ దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూశిస్తున్నాడని, మహిళలు అని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కూలీలు వాపోయారు.ఫీల్డ్ అసిస్టెంట్ తనకు అనుకూలంగా ఉన్న గ్రూపులకు,పక్కన గ్రూపుల మహిళల కు టార్గెట్ పెడుతూ, ముగ్గురు మహిళలు ఒక ట్రాక్టర్ ట్రిప్పు మట్టి పోయాలని ఇబ్బంది పెడుతున్నాడని వారు తెలిపారు.ఇదేం అన్యాయం అని ప్రశ్నించిన మహిళలను మీకు ఇష్టం ఉంటే పని చేయండి, లేకపోతే పని మానేయండి అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరిస్తున్నాడని కూలీలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img