- కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
- నేడు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక.!
కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఓదెలు కొంతకాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడంలేదని అసంతృప్తితో ఉన్న ఆయన.. తన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు సాయంత్రం రాహుల్‌గాంధీ సమక్షంలో వీరివురు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. 2009 లో టీఆర్ ఎస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఓదెలు.. 2010 ఉప ఎన్నిక, 2014 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఓదెలుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. బాల్క సుమన్‌కు చెన్నూరు నుంచి టీఆర్ఎస్ టికెట్ కేటాయించగా, ఆయన గెలుపొందారు. ఇక అప్పటి నుంచి ఓదెలు పార్టీకి దూరంగా ఉంటున్నారు.