Saturday, July 27, 2024

వ‌న్‌కి రోడ్డే పార్కింగ్‌

Must Read
  • షాపింగ్ మాల్‌పై ప్రేమ చూపించిన అధికారులు
  • పార్కింగ్ స్థ‌లం లేక‌పోవ‌డంతో రోడ్డును క‌మ్మేసిన వాహ‌నాలు
  • పోలీస్ హెడ‌క్వార్ట‌ర్స్‌కు కూత‌వేటు దూరంలోనే మాల్‌
  • అయినా.. జాడ‌లేని ట్రాఫిక్ పోలీసులు
  • వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు
  • అధికారుల తీరుపై జ‌నం మండిపాటు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హ‌న్మ‌కొండ‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట ఆదివారం ప్రారంభ‌మైన‌ వ‌న్‌షాపింగ్ మాల్‌తో ట్రాఫిక్ అస్త‌వ్య‌స్తంగా మారింది. షాపింగ్ మాల్‌కు సంబంధించి పార్కింగ్ స్థ‌లం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకుండానే మాల్ ప్రారంభించ‌డంతో ప్ర‌ధాన ర‌హ‌దారిపైనే ఇష్టారాజ్యంగా వాహ‌నాలు నిలిపారు. పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ జంక్ష‌న్ నుంచి హ‌న్మ‌కొండ చౌర‌స్తాకు వెళ్లే మార్గంలో కిష‌న్‌పుర రోడ్డు వ‌ర‌కు బైకులు, కార్లు పార్కింగ్ చేయ‌డంతో మిగ‌తా వాహ‌నాల రాక‌పోకల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ ప్రాంతంలో నిత్యం అందుబాటులో ఉంటూ ట్రాఫిక్‌ను ప‌ర్య‌వేక్షించే పోలీసులు మాత్రం ఆదివారం జాడ‌లేకుండా పోయార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ట్రాఫిక్ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రోడ్డుపైన ఒక్క వాహ‌నం నిలిపినా.. వెంట‌నే ట్రాఫిక్ లిఫ్టింగ్ వెహికిల్‌తో తీసుకెళ్లే ట్రాఫిక్ పోలీసులు.. ఈరోజు మాత్రం కంటికిక‌నిపించ‌లేద‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి. ఇదంతా కూడా షాపింగ్ మాల్ నిర్వాహ‌కుల‌పై అమిత‌మైన ప్రేమ‌తోనే ట్రాఫిక్ పోలీసులు చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేశారంటూ మిగ‌తా వాహ‌న‌దారులు, బాట‌సారులు మండిప‌డుతున్నారు.

 

  • ప్ర‌జాప్ర‌తినిధులు.. అధికారుల అండ‌తో…
    పోలీస్ హెడ్‌క్వార్ట‌ర్స్ జంక్ష‌న్ భ‌ద్ర‌తా రీత్యా అత్యంత కీల‌క‌మైన ప్రాంతం.. నిత్యం వంద‌లు, వేలాది వాహ‌నాలు రాక‌పోక‌లు సాగించే జంక్ష‌న్‌.. హెడ్‌క్వార్ట‌ర్స్ కేవ‌లం సుమారు ఇర‌వై అడుగుల దూరంలో ప్రారంభ‌మైన వ‌న్ షాపింగ్ మాల్‌తో ట్రాఫిక్ క‌ష్టాలు వ‌చ్చిప‌డుతుంటే.. పోలీసులు క‌నీస చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. బ‌తుకుదెరువు కోసం రోడ్లుపై చిన్న‌చిన్న వ్యాపారాలు చేసుకునే పేద‌లపై మాత్ర అత్యంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే పోలీసులు.. పెద్ద‌ల వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి.. సైలెంట్‌గా ఉండిపోవ‌డంపై అనేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. బ‌డా వ్యాపారుల‌కు మాత్రం అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల అండ‌తోనే వ్యాపారులు పార్కింగ్ స్థ‌లాలు లేకుండానే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.
  • పార్కింగ్ స్థ‌లం పూర్తికాకుండానే…
    వ‌న్ షాపింగ్ మాల్‌కు సంబంధించి పార్కింగ్ స్థ‌లం పూర్తికాకుండానే.. పూర్తి స్థాయిలో అందుబాటులో రాకుండానే.. మాల్ ప్రారంభోత్స‌వానికి గ్రేట‌ర్ మున్సిప‌ల్ అధికారులు ఎలా అనుమ‌తులు ఇస్తార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. ట్రాఫిక్ నియ‌మ‌నిబంధ‌న‌లు పాటించ‌ని వ్యాపారుల‌కు మున్సిప‌ల్ అధికారులు వ‌త్తాసుప‌ల‌క‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవల‌సిన అవ‌స‌రం ఉంది.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img