Monday, September 16, 2024

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Must Read

అక్షర శక్తి పరకాల: నియోజకవర్గం లోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన నడి కూడా పరకాల రూరల్ మరియు టౌన్ లోని వివిధ గ్రామాలకు చెందిన 71మంది లబ్ధిదారులకు 18 లక్షల 62వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అమలు చేస్తున్నారని అర్హులైన ప్రతి పేదవారికి పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ ప్రతి అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అన్నారు. గత 10 సంవత్సరాల బి ఆర్ స్ పాలనలో తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రముగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా నిరుపేదలకు అందించాల్సిన సీఎంఆర్ఎఫ్ లో కూడా అవినీతికి పాల్పడిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి పేదవాడి ఆదుకోవాలని సంకల్పంతో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా మంజూరు చేసి అందించిన సీఎం రేవంత్ రెడ్డి కి లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత, రామకృష్ణ, కౌన్సలర్లు నలేల్ల జ్యోతి, అనిల్, బొచ్చు అనంత్, మాజీ ఎంపీపీ ఒంటెరు రామ్మూర్తి, కొయ్యడ శ్రీనివాస్, మడికొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img