Wednesday, June 19, 2024

ఎట్ట‌కేల‌కు ములాక‌త్‌కు అనుమ‌తి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీకి ఎట్ట‌కేల‌కు అనుమతి ల‌భించింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ‍్క్షప్తి చేయడంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ ధృవీకరించారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కూడా అనుమతి ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నాం సమయంలో జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను వీరు పరామర్శిస్తారు. ఓయూలో రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించిన‌ నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నాయ‌కులు నిరసనలు చేపట్టగా పోలీసులు వారిని అరెస్టు చేసి చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img