Monday, September 16, 2024

అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరునాగారం: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం అడవి ప్రాంతంలోనీ లింగపురం, గోతి కోయ గూడెంలో ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. గూడాలలో అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. అనుమానాస్పద కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడాలలో వారి ఆరోగ్య పరిస్థితి, సౌకర్యాలు, పిల్లలకు విద్య పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గూడాలలో వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిల వద్ద వాహన తనిఖీ చేపట్టారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్, ప్రతి ఒక్క ద్విచక్ర వాహన దారుడు హెల్మెట్ ధ‌రించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం. ఎస్సై తాజుద్దీన్. రెండవ ఎస్సై రమేష్ సివిల్. సిఆర్పిఏఫ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్, రెండవ ఎస్సై రమేష్ సివిల్, సిఆర్పిఏఫ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img