పంజాబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్‌సింగ్ చన్నీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. బర్నాల్ జిల్లా భాదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అనేక జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, వీటి అభివృద్ధే ధ్యేయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు.