అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పది రోజుల పాటు బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. గురువారం అర్ధరాత్రి ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరిలో ఒకరిని అదుపులో తీసుకొని మిగిలిన వారిని వదిలేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన కమలాపూర్ మండలంలో కలకలం సృష్టించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Previous article
Next article
Latest News