Saturday, September 7, 2024

ఎమ్మెల్యే అరూరికి భారీ షాక్

Must Read
  • బీఆర్ఎస్ పార్టీకి రతన్‌రావు రాజీనామా
  • కాంగ్రెస్ పార్టీలో చేరిక
  • కండువా కప్పి ఆహ్వానించిన
    వ‌ర్ధ‌న్న‌పేట అభ్యర్థి కేఆర్ నాగరాజు
  • హ‌స్తం పార్టీలోకి చేరిక‌ల జోరు

అక్షరశక్తి, వర్ధన్నపేట: ఎన్నికల ముంగిట వర్ధన్నపేట బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నాయకుడు, పర్వతగిరి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, వరంగల్ ఏనుమాముల మార్కెట్ మాజీ డైరెక్టర్ శాంతి కుమార్ రతన్ రావు బీఆర్ఎస్‌ రాజీనామా చేశారు. వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు భారీ షాక్ తగిలినట్టేనని రాజకీయ వర్గాలు అంటు న్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ తీరుపై రతన్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది ఈనేపథ్యంలోనే ఆయన కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. 2015 నుంచి 2019 వరకు రెండుసార్లు పర్వతగిరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడిగా రతన్ రావు బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్‌గా 2019 నుంచి 2023 వరకు కొనసాగారు. అయితే, ఎమ్మెల్యే రమేష్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారిలో రతన్ రావు కూడా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం క‌ల‌క‌లంరేపుతోంది. సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రతన్ రావుకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. క్యాడర్లోను పట్టుంది‌. ఇప్పుడు రతన్ రావు రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

నాగరాజు సమక్షంలో భారీగా చేరికలు…

వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా
వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామానికి చెందిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎల్‌డీఎం ఇంఛార్జి కుందూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్, మండల బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శాంతి రతన్ రావు, బీజేపీ మండల యూత్ అధ్యక్షులు వీరారపు యా కుబ్ రెడ్డి, సీనియర్ నాయకులు బోనాల వెంకన్న, ఇతర నాయకులు హ‌స్తం గూటికిచేర‌గా, వీరంద‌రికీ వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన‌వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేమంతా అహర్నిశలు శ్ర‌మించి అసెంబ్లీకి పంపించే విధంగా పనిచేస్తాం అని మాట ఇచ్చారు. అనంతరం కేఆర్ నాగరాజు మాజీ ఏంఎంసీ డైరెక్టర్‌ను శాలువాతో సత్కరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img