Saturday, July 27, 2024

బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగిస్తున్న రేవంత్‌రెడ్డి

Must Read

కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహం

టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొను గోలుకు బీజేపీ కుట్రం చేసిందని కేసీఆర్ ఎలాగైతే ఆరోపిస్తున్నారో.. ఇప్పుడు అచ్చం అలాగే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసిందని.. కేసీఆర్‌ను టార్గెట్ చేయబోతున్నారు రేవంత్‌రెడ్డి. పదవులు, డబ్బులను ఆశజూపి.. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని కాంగ్రె స్ ఆరోపిస్తోంది. ఈ విషయమై మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశం కా నున్నారు. అనంతరం ఇతర నేతలతో కలిసి మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారిన తర్వాత ఆ ఎమ్మెల్యేలకు ఆర్థికపరంగా, రాజకీయపరంగా ప్రయోజనాలు చేకూరాయని ఫిర్యాదులో పేర్కొననుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా మొయినాబాద్ పీ ఎస్‌లోనే నమోదైంది. ఇప్పుడు అదే పీఎస్‌లో టీఆర్ఎస్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది. న‌లుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిట్‌, సీబీఐ, హైకోర్టుల‌లో వాద‌న‌లు కొన‌సాగుతున్న స‌మ‌యంలో కాంగ్రెస్ ఫిర్యాదు అంశం సంచ‌ల‌నంగా మారింది.
2018 ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల‌కుగాను కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల విజయం సాధించింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి పీ సీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. హుజూ ర్‌నగర్ నుంచి తన భార్యను రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో పద్మావతి రెడ్డి ఓడిపోవడంతో… అసెంబ్లీ కాంగ్రెస్ బలం 18కి పడిపోయింది. అనంత‌రం 18 ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది హస్తం పార్టీకి హ్యాండి చి టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారిలో… పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు , పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, కొల్లాపూర్ నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు వీరందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతోంది టీ పీసీసీ. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో మునుగోడు ఎమ్మెల్యే గత ఏడాది కాంగ్రెస్ పార్టీని బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకి పడిపోయింది. ప్రస్తుతం మంథని నుంచి శ్రీధర్ బాబు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ములుగు నుంచి సీతక్క, మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img