ఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.