ఇద్దరి పరిస్థితి విషయం..
అక్షరశక్తి, ఆత్మకూరు : హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే వారంతా ఆదివారం ఉదయం కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కాగా, తీవ్ర గాయాలపాలైన వారు కారులోనే ప్రాణాలు విడిచినట్లు స్తానికులు చెబుతున్నారు. కాగా, చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ వాసులుగా తెలుస్తోంది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.