- కాంగ్రెస్‌లోకి క్యూకడుతున్న గులాబీ నేతలు, బీజేపీ నాయకులు
- గండ్ర సత్యనారాయణరావు చేపడుతున్న ప్రజా దీవెన యాత్రలో చేరికల జోరు
- తాజాగా హస్తం గూటికి వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి – శ్రీనివాస్ దంపతులు
- మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ సహా 150 మంది కాంగ్రెస్ తీర్థం ..
అక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు చేపడుతున్న ప్రజా దీవెన యాత్రలో చేరికల జోరు కొనసాగుతోంది. తాజాగా, భూపాలపల్లి రూరల్ మండల వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి – శ్రీనివాస్ దంపతులు హస్తం గూటికి చేరుకున్నారు. అదేవిధంగా కమలాపూర్ గ్రామ బీజేపీ మాజీ ఎంపీటీసీ రేగళ్ల భాగ్యలక్ష్మి – సదానందం దంపతులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. వీరితో పాటు కమలాపూర్ మాజీ సర్పంచ్ గుండు సమ్మయ్య, భూపాలపల్లి కోల్ ట్రాన్స్‌పోర్ట్ లారీ అసోసియేషన్ ప్రసిడెంట్ బాల్ చంద్ నాయక్, బీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ కోశాధికారి, జవహర్ నగర్‌లోని సీనియర్ నేత పెరుమాండ్ల తిరుపతి గౌడ్, తోపాటు కమలాపురం గ్రామం నుండి సుమారు 150 మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా రజక సంఘం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు మిన్నపురం సంతోష్, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు దుప్పట్ల సంపత్, ముత్యాల రాజబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్ర మంలో కమలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి వెంకటస్వామి, గ్రామ మాజీ సర్పంచ్ తోట సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామినేని రవీందర్ తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..
భూపాలపల్లి నియోజకవర్గంలో వేగంగా మారుతున్న సమీకరణాలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సామాన్య కార్యకర్త నుంచి మొదలు.. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే దసరా రోజే సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి ఐదుగురు కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. కౌన్సిలర్లు కురిమిల్ల రజితశ్రీనివాస్, చల్లూరి మమతకమలాకర్, ముంజాల రవి గౌడ్, చల్ల రేణుకరాములు, తొట్ల సంపత్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ మండ సంపత్ గౌడ్ కూడా హస్తం గూటికి చేరారు. వీరందరూ హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసంలో భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా పరకాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి వెంట సాధనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ లావుడ్య వెంకటేష్‌తోపాటు పలు గ్రామాలకు చెందిన మరో 200 మంది బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఊహించని ఈ పరిణామంతో నియోజకవర్గ బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ము న్ముందు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్‌లోకి ఊహించని చేరికలు ఉంటాయని ఆపార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.