Tuesday, June 18, 2024

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ మృతి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ సాయిచంద్‌(39) హఠాన్మరణం చెందారు. బుధ‌వారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర విషాదం నెల‌కొంది. 1984 సెప్టెంబర్‌ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్‌ జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన.. విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటిచెప్పారు. 2021, డిసెంబర్‌లో సాయిచంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img