Monday, June 17, 2024

ప్రకాష్ రాజ్‌కి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతోంది. ఓరుగ‌ల్లులో నిన్న నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్ అవ‌డంతో కాంగ్రెస్ నేత‌లు మాంచి జోష్ మీదుండ‌గా, అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ స‌భ‌పై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈక్ర‌మంలోనే సీఎం కేసీఆర్‌కి సన్నిహితుడిగా మెదులుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం రాహుల్‌ని ఉద్దేశించి ఘాటు ట్వీట్ చేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రి లేరని.. ఓ రాజా ఉన్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్పందించారు. తెలంగాణలో దార్శనికత ఉన్న నాయకుడు కేసీఆర్ ఉన్నారని.. కొంతమంది ఫూల్స్‌ని పెట్టుకుని మీరేం చేస్తారో చెప్పాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌కాశ్‌రాజ్ ట్వీట్‌పై మండిప‌డుతున్న నేత‌లు

ఫూల్స్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క దీనిపై తీవ్రంగా స్పందించారు. అసలు నువ్వెవరని ఆమె సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో నిన్నెక్కడా చూడలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలను ఫూల్స్ అంటున్న ప్రకాష్ రాజ్.. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాంగ్రెస్ నేతలేనని గుర్తుంచుకోవాలన్నారు. హద్దుల్లో ఉంటే మంచిదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img