అక్షరశక్తి, పరకాల : అఖిల భారత సఫాయి మజ్ధూర్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోద రామకృష్ణ ఎన్నికయ్యారు. ఆ సంఘం జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ బృందం శుక్రవారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మున్సిపల్ చైర్మెన్ సోద అనిత రామకృష్ణ, వైస్ చైర్మెన్ రేగూరి విజయపాల్‌రెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా అలోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్మచారులకు మున్సిపల్ చైర్మెన్ గా అవకాశం ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అభినిందించారు. సోద రామకృష్ణను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు తెలిపి నియామక పత్రం అందజేశారు.
తన నియామకానికి సహకరించిన నాయకులకు సోద రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మెన్ విజయపాల్‌రెడ్డి ఈ సందర్భంగా రామకృష్ణకు శుభకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మెన్ గందె వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ఒంటేరు సారయ్య, పసుల లావణ్య రమేశ్, శనిగరపు రజినీ నవీన్, మార్క ఉమాదేవీ, రఘుపతిగౌడ్, టీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను, నాయకులు బొచ్చు జెమినీ, ఏకు రమేశ్, ఇనుగాల రమేశ్ పాల్గొన్నారు.