Monday, September 9, 2024

ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ క‌ల‌క‌లం

Must Read
  • మ‌రో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్
  • ఐసోలేష‌న్‌లో ఆరుగురు
    అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు, ఆగస్టు 03: మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపింది. బుధవారం అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య పరీక్ష‌ల్లో 83 మందికి టెస్టులు చేయగా మ‌రో ముగ్గురు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. గత మంగళవారం 32 మందికి టెస్టులు చేయగా ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీతానగరం ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థుల సంఖ్య ఆరుకు చేరింది. పాజిటివ్ బారిన‌ప‌డిన విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాలలో ఐసోలేష‌న్ గదిని ఏర్పాటు చేసి వారి బాగోగులను చూస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం గంగు నాయక్, వార్డెన్ సాంబయ్య తెలిపారు.
    దామరవంచ గురుకులంలో ఒకరికి పాజిటివ్
    గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం అయోధ్యపురం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో 50 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా అందులో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img