Sunday, September 8, 2024

జ‌న‌వ‌రి 28 నుంచి స్టాటస్టిక్స్ ఒలంపియాడ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌

Must Read
  • ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్లు చేసుకోవాలి

అక్ష‌ర‌శ‌క్తి, మణుగూరు : సీఆర్ రావు ఏఐఎంఎస్సీఎస్ నిర్వహించే జాతీయస్థాయి ఒలంపియాడ్ జనవరి 28, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 4వ తేదీల్లో జ‌రుగుతుంద‌ని, దీనికోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి శ్రీనివాస్ ఒక‌ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్‌లైన్‌ ఒలంపియాడ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు సంబంధించి అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరులో సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా జూనియర్ లెవెల్ 8, 9, 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల కోసం, సీనియర్ లెవెల్ 11, 12, డిగ్రీ విద్యార్థుల కోసం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ స్టాటిస్టిక్స్ ఒలంపియాడ్‌లో భాగస్వాములు కావాల‌ని అన్నారు. మొదటి బహుమతిగా రూ.25,000, రెండో బహుమతి రూ.20,000, మూడో బహుమతి రూ.15,000, నాలుగో బహుమతి రూ.10,000, ఐదో బహుమతి రూ.5000 ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. మణుగూరు పరిసర ప్రాంత విద్యార్థులతో పాటు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని స్టాటస్టిక్స్ ఒలంపియాడ్ ఎగ్జామ్ లో భాగస్వాములు అవ్వాలని డాక్టర్ బి శ్రీనివాస్ తెలియజేశారు. https://crraoaimscs.res.in/statistics-olympiad-2024.php ఈ లింకు ద్వారా జనవరి 22 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img