Saturday, September 7, 2024

కాసేపు ఎండ‌లో ఉండండి..

Must Read

పంచ‌భూతాల్లో సూర్య‌డు ఒక భాగ‌మే. సూర్యుడు లేనిదే స‌మ‌స్త జీవ‌రాసులు బ‌త‌క‌లేవు. ప్ర‌కృతి కూడా ఉండ‌దు. అందుకే ఆరోగ్యం భాస్క‌రాధిచ్చేత్ అన్నారు పెద్ద‌లు. సూర్య కిర‌ణాలు సోక‌ని ఇల్లు రోగులకు, భూతాల‌కి నిల‌య‌మ‌వుతుంది. అందుకే వారి ఇంట్లో నిత్యం రోగాలు వ‌స్తుంటాయి. మాన‌సిక వ్యాధులు ఎక్కువ‌గా ఉంట‌వి. ఇండ్ల‌లోకి గాలి, వెలుతురు రాక నానా రోగాల‌కు గుర‌వుతున్నారు. అందుకే ఇంట్లో వారంద‌రూ ఆరోగ్యంగా ఉండాలంటే, ఇంటిచుట్టూ ఖాళీ స్థ‌ల‌ము, సూర్యుడి దిక్కుగా ద్వారాలు, కిటికీలు ఉండాలని అంటున్నారు ప్ర‌ముఖ ప్ర‌కృతి వైద్య నిపుణులు డాక్ట‌ర్ చిలువేరు సుద‌ర్శ‌న్‌. ఎండ‌లో ఉండ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య లాభాల గురించి వివ‌రిస్తున్నారు.

  •  ప్ర‌తీరోజు ఉద‌యం ప‌ది గంట‌ల‌లోపు, సాయంత్రం నాలుగు గంట‌ల త‌ర్వాత అర‌గంట‌సేపు త‌క్కువ దుస్తుల‌తో ఎండ‌లో కూర్చోవాలి. ఇలా చేయడం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు క‌లుగుతాయి.
  •  ఆక‌లి పెరుగుతుంది. ఎముక‌లు ప‌టిష్టంగా ఉంటాయి.
  •  ర‌క్త‌ము ప‌రిశుభ్ర‌మ‌వుతుంది. కొవ్వు క‌రుగుతుంది.
  •  కండ‌రాలు, నాడులు బ‌ల‌ప‌డుతాయి.
  •  మ‌న‌స్సుకు సంతోషం, ఆహ్లాదం క‌లుగుతుంది.
  •  సూర్య‌ర‌శ్మిలో విట‌మిన్ డి ఉంటుంద‌ని చాలా మందికి తెలియ‌దు. ఇది ఎముక‌ల పెరుగుద‌ల‌కి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img