Monday, September 16, 2024

అంధుని జీవితానికి పోలీసుల ఆసరా – ఇళ్ళు కట్టించిన ఎస్పీ

Must Read

అక్ష‌ర‌శ‌క్తి మహబూబాబాద్: జిల్లా నర్సింహులుపేట మండలం పెద్దనాగారంలో మందుల నాగన్న అనే అంధుడు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. కంజర కొడుతూ.., పాటలు పాడుతూ యాచకవృత్తితో నాగన్న జీవించేవారు. కంటిచూపు లేకపోవడంతో తల్లిదండ్రుల తోడుగా యాచిస్తూ జీవించేవాడు. పెద్దనాగారంలో నిలువనీడ కూడా లేకపోవడంతో ఓ..ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఎండకుఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ దయనీయంగా జీవించేవాడు. నర్సింహులుపేట ఎస్ఐ సతీష్ ద్వారా ఈ..విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ మానవత్వంతో స్పందించారు. నిలువనీడలేని ఆ..అంధుని కుటుంబానికి పోలీసులే ఆసరాగా మారాలనే ఆలోచనతో ముందుకు సాగారు. ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ మంచిమనసులో పుట్టిన ఆలోచన, ఆచరణలోకి వచ్చింది.., ప్లాస్టిక్ కవర్ నీడలో బ్రతుకొక నరకంగా గడిపిన ఆ..కుటుంబానికి భరోసా లభించింది. కనీసం వారు కలలో కూడా ఊహించుకోనట్లుగా పక్కాగృహాన్ని పోలీస్ శాఖ స్వయంగా నిర్మించి బహుమతిగా ఇచ్చింది.

జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ స్వయంగా పెద్దనాగారం వచ్చి అంధుడు మందుల నాగన్న తో కలిసి ఇంటిని ప్రారంబించారు. ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ లోని మానవీయకోణాన్ని, ఎస్పీ దిశనిర్ధేశకత్వంలో జిల్లాపోలీస్ ల పనితీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. శభాష్ మహబూబాబాద్ పోలీస్ అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img