Tuesday, September 10, 2024

ఆద‌రించండి అభివృద్ధి చేస్తా..

Must Read
  • వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టీడీపీపీ అభ్య‌ర్థి అయిలాపురం వేణుచారి
  • నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం..
  • రెండు వంద‌ల మంది యువ‌కుల‌తో హ‌న్మకొండ‌లో ర్యాలీ

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: మెరుగైన సమాజం కోసం నేనుసైతం అంటూ ముందుకు క‌దులుతున్నారు అయిలాపురం వేణుచారి. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందించడమే ధ్యేయమంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌డుతున్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంతోపాటు విద్య, వైద్యాన్ని ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇస్తున్నారు. వీకే హెల్పింగ్ సొసైటీని ఏర్పాటు చేసి ద‌శాబ్ధ‌కాలంగా అనేక మందికి చేయూత‌నందించిన వేణుచారి.. తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ తరఫున వ‌రంగ‌ల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న విస్తృత ప్ర‌చారం చేప‌డుతున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాన‌ని హామీ ఇస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ క‌ర‌ప‌త్రాలు పంచుతూ ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. తాజాగా గురువారం హ‌న్మ‌కొండ‌లో భారీ ర్యాలీ నిర్వ‌హిం చారు. న‌క్క‌ల‌గుట్ట నుంచి మొద‌లైన ర్యాలీ, అంబేద్క‌ర్ విగ్ర‌హం, పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌, చౌర‌స్తా, ములుగురోడ్ మీదుగా ఎంజీఎం వ‌ర‌కు సాగింది. సుమారు రెండు వంద‌ల మంది యువ‌కులు పాల్గొన్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img