- కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి
- బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా హస్తంగూటికి..
- మానుకోటలో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ
అక్షరశక్తి, మహబూబాబాద్: గూడూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ కీలకనేత, పీఏసీఎస్ చైర్మన్ చల్లా లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తంగూటికి చేరారు. రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి లింగారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు గూడూరు మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో చల్లా లింగారెడ్డితోపాటు బోజ శంకర్, పీ కుమారస్వామి, చల్ల వెంకట్‌రెడ్డి, సానుగంటి వీరస్వామి, మోదుగు వెంకన్న, చాపల నాగేశ్వరరావు, బొల్లికొండ సుధాకర్, సునీత, సురేష్, హుస్సేన్, షాబీర్, అక్తర్, బాలు, శ్రీనివాసరెడ్డి, కోరే గౌరయ్య, బోడ రవి, సాంబరాజు, బొల్లెపల్లికి చెందిన మెట్టు వీరస్వామి, కొమ్మాల్ రెడ్డి, కరుణాకర్, మహేందర్, వీరన్న, సారయ్య, వీరేందర్, విజయ్ బాబు, కృష్ణ, సారయ్య, చందర్, రమేష్, కృష్ణ, కుమారస్వామి, పరుశురాములు, శ్రీను, కన్నా, నరసింహనాయక్, వీర్ల వెంకన్న, రవి శ్రీను, లక్ష్మణ్, రాజా రామ్ తదితరులున్నారు. ఈ చేరికలతో మానుకోటలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హ్యాట్రిక్ సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు ఊహించని షాక్ తాకింది. వీరితో పాటుగా గూడూరు మండలానికి చెందిన మరికొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా త్వరలోనే పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది.
Must Read