Saturday, July 27, 2024

డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరాల్సిన ఆదాయంలో రూ.40వేలకోట్లకుపైగా తగ్గుదల నమోదైందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలిపేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img