Friday, September 13, 2024

ప్రజల కష్టసుఖాల్లో గండ్ర సత్యనారాయణరావు

Must Read
  • రెండుసార్లు ఓడినా నియోజకవర్గంలోనే సత్తెన్న
  • టీడీపీ, బీఆర్ఎస్‌లో దక్కని టిక్కెట్
  • ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఆదరించిన ప్రజలు
  • గత ఎన్నికల్లో రెండో స్థానం.. ఈసారి కలిసి రానున్న సానుభూతి..
  • భూపాల‌ప‌ల్లిలో కాంగ్రెస్ ప‌వ‌నాలు..!

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి: ఎన్నిక‌ల్లో గెలిపిస్తే గ‌ట్టిగ ప‌నిచేస్తం.. ఓడ‌గొడితే రెస్ట్ తీసుకుంటం… అని భావించే నాయ‌కుడు కాదాయ‌న‌. ఎన్నిక‌ల్లో ఓడినా నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంట‌రు. వాళ్ల క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకుంట‌రు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న నాయ‌కుడు చుట్ట‌పు చూపుగా క‌నిపిస్తాడేమోగానీ, ఆయ‌న మాత్రం నియోజ‌కవ‌ర్గాన్నే అంటిపెట్టుకుని ఉంట‌రు. ఆయ‌న‌కు పార్టీల‌తో సంబంధంలేదు.. ప్ర‌జ‌ల‌తోనే అనుబంధం. అందుకే నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా మారిపోయారు భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణరావు. ఇప్పుడున్న రాజకీయాల్లో సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎన్నికల సమయంలో కనిపించిన నాయకులు ఆ తర్వాత గెలిచినా, ఓడినా ముఖంచాటేసే పరిస్థితి. కానీ, భూపాలపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా గండ్ర సత్యనారాయణరావు మాత్రం నిరాశ చెంద‌లేదు. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌పై ఉన్న అభి మాన‌మూ త‌గ్గ‌లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఎన్నిక‌ల్లో ఓడిపోయినా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ మాత్రం కించెత్తైనా త‌గ్గ‌ద‌ని, అందుకు తాజాగా గండ్ర ప్ర‌చారానికి ల‌భిస్తున్న స్పంద‌నే నిద‌ర్శ‌న‌మ‌ని స‌త్తెన్న అభిమానులు గ‌ర్వంగా చెబుతున్నారు.

టీడీపీ, బీఆర్‌ఎస్ మోసం..

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2014లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా భూపాలపల్లి సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో అప్పటి వరకు టీడీపీ నాయకుడిగా నియోజకవర్గంలో మంచి పేరున్న సత్యనారాయణరావు ఆపార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి బీఫామ్ తెచ్చుకున్నారు. బీజేపీ త‌రుపున పోటీచేసి ఎన్నికల్లో 57,530 (30.34) ఓట్లు తెచ్చుకొని బీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థులకు సవాల్ వి సిరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో టికెట్ హామీని బీఆర్ఎస్ నెరవేర్చకపోవడంతో అప్పటికప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) తరపున పోటీ చేసి అధికార బీఆర్ఎస్ అభ్యర్థిని వెనక్కినెట్టి 54,283 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి అనంతర రాజకీయ పరిణామా లతో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. దీంతో రేవంత్‌రెడ్డి సమక్షంలో గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు టికెట్ చేజారినా, ఎన్నిక‌ల్లో ఓడినా ప్ర‌జ‌ల్లో స‌త్య‌నారాయ‌ణ‌కు ఉన్న ప‌లుకుబ‌డి ఏమాత్రం త‌గ్గ‌లేదు. దీన్ని గుర్తించిన హైక‌మండ్ ఈసారి కాంగ్రెస్ నుంచి గండ్ర‌ను పోటీకి నిలిపింది.

సొంత ఇమేజ్..

పార్టీల‌తో సంబంధంలేకుండా గండ్ర సత్యనారాయణరావుకు భూపాల‌ప‌ల్లి నియోజకవర్గంలో సొంత ఇమే జ్ ఉంది. అన్ని మండ‌లాల్లో ఆయ‌న‌కు పార్టీల‌కు అతీతంగా వంద‌లాదిగా అభిమానులు, అనుచ‌రులు ఉన్నారు. ఇదే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను గెలుపు అంచుల‌దాకా తీసుకెళ్లింది. టీడీపీ నేతగా కొనసాగినప్పటి నుంచి కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు కష్టసుఖాల్లో పాలుపంచుకుం టున్నారు. ఊర్ల‌లో జరిగే శుభకార్యాలతోపాటు నియోజకవర్గంలో ఎక్క‌డ కార్యకర్తలు చనిపోయినా, ఇబ్బం దుల‌పాలైనా వాళ్ల‌ను పరామర్శించడం సత్యనారాయణరావుకు అలవాటుగా మారింది. ఈ అంశాలే ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావుకు క‌లిసిరానున్నాయి. అంతేగాక రెండు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జోష్ గండ్ర విజ‌యానికి దోహ‌దం చేయ‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహంలేదు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు త‌న స‌త్తాచాటుకున్నారు. అనుచరుల‌ను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేయించి గెలిపించుకున్నారు. గణపురం జెడ్టీటీసీతోపాటు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. పలు మండలాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సైతం ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో విస్తృత ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తుండ‌టం, భారీ చేరిక‌లు కొన‌సాగుతుండ‌టంతో గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు గెలుపు సాధ్య‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img