Sunday, September 8, 2024

తెలంగాణ స్కిల్ యూనివ‌ర్సిటీ కోర్సులు ఇవే..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబోయే “తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ”కి సంబంధించిన బిల్లును త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో కలిసి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పుతున్న ఈ వర్సిటీ లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్సిటీలో డిగ్రీ, డిప్లమాలతో పాటు సర్టిఫికెట్ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని సీఎం చెప్పారు.

* ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫార్మా, నిర్మాణం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ-కామర్స్, యానిమేషన్, గేమింగ్ వంటి డిమాండ్ ఉన్న రంగాలకు చెందిన కోర్సులను ప్రవేశపెట్టాలని, ప్రతి కోర్సును ఆయా రంగాల్లో పేరొందిన కంపెనీల భాగస్వామ్యం ఉండాలే అనుసంధానం చేయాలని నిర్ణయించారు.

* మొదటి ఏడాది 2 వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20 వేల మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన నిధుల విషయంలో రాజీపడొద్దన్నారు. సమావేశంలో వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని వర్సిటీపై పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img