Sunday, September 8, 2024

నేను సీఐని తిట్టలేదు.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర, కోర్టులోనే తేల్చుకుంటా: మహేందర్‌ రెడ్డి

Must Read

ఆ ఆడియో తనది కాదు : మ‌హేంద‌ర్‌రెడ్డి

తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ బూతుపురాణం ఆడియో వైర‌ల్ అవ‌డంతో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆ ఆడియో తనది కాదని… ఈ విషయంలో కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదంతా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను నోటీసు ఇవ్వమనండి… విచారణను ఎదుర్కొంటా అని తెలిపారు. రోహిత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు.

అస‌లేం జ‌రిగింది

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య ఆధిపత్యపోరు, వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈక్రమంలో నేతలు డైరెక్ట్‌గా రంగంలోకి దిగకుండా మధ్యలో అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూర్ సీఐ రాజేందర్‌రెడ్డిపై బూతు పురాణం అందుకోవ‌డం క‌ల‌క‌లంరేపింది. తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా.. ? అంటూ నోటికొచ్చినట్లుగా ఫోన్‌లో బూతులు తిట్టారు. ప్రజాప్రతినిధులు ఉపయోగించకూడని భాషతో నీ అంతు చూస్తా..! అని వార్నింగ్ ఇచ్చిన ఆడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

నోరు పారేసుకున్న ఎమ్మెల్సీ..

మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఫోన్‌ కాల్‌ చేసి తిడుతుంటే సీఐ రాజేందర్‌రెడ్డి పద్ధతిగా మాట్లాడాలని ఎమ్మెల్సీకి సూచించారు. అందుకు కూడా ఆయన మరింత రెచ్చిపోయారు. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రౌడీషీటరా .. ? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా..? ఇప్పటి నుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

ఆయన మీద కోపం సీఐపై చూపించారా..?

కొద్ది రోజులుగా తాండూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ట్నం మహేందర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో తాండూర్ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం, పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత కొరవడిందనే టాక్‌ కూడా నడిచింది. అయితే రీసెంట్‌గా ఆయనకు పార్టీ ఎమ్మెల్సీని చేయడంతో మళ్లీ ఇద్దరు నేతల మధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. అలాగే స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న కోల్డ్‌ వార్‌ కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్యలో అధికారులు నలిగిపోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img