Sunday, September 8, 2024

విద్యారంగాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

Must Read

– విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తాం..
– పీడీఎస్‌యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వరరావు

అక్ష‌ర‌శ‌క్తి, ఖ‌మ్మం : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా విద్యారంగా అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, విద్య రంగాన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పీడీఎస్‌యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ ఆఫీసులోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ అధ్యక్షతన నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో గత ప‌దేళ్లుగా విధ్వంసానికి గురైన విద్యారంగాన్ని గాడిలో పెట్టి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అరకొరగా 7.3శాతం నిధులు కేటాయించడం విద్యారంగాన్ని విస్మరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. ఆజాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహా రావు, కాంపాటి పృథ్వీ, సహాయ కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్, సుమంత్, గణేష్, అనిల్, నరేందర్, సతీష్, తిరుపతి, రాకేష్, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img