Sunday, September 8, 2024

అడిషనల్ కలెక్టర్‌ను కరిచిన కుక్కలు.. తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స

Must Read

తెలంగాణలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా శున‌కాలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు కనపడితే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృత్యువాత పడగా.. ఆ తరువాత కూడా కొన్ని జిల్లాల్లో వీధి కుక్కల దాడులు జరిగాయి. ఇక తాజాగా సిద్ధిపేట కలెక్టరేట్‌లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. అద‌న‌పు క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మ‌రో ఇద్ద‌రిని కుక్క‌లు తీవ్రంగా క‌రిచాయి. అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ పెంపుడు శున‌క‌మూ తీవ్రంగా గాయ‌ప‌డింది. ఈ విష‌యాలు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చాయి.
సిద్ధిపేట శివారులో కలెక్టరేట్‌తో పాటు ఇతర అధికారుల నివాసాలు ఉన్నాయి. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తన క్వార్టర్స్ ఆవరణలో పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన వీధి కుక్క అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసింది. అతని రెండు కాళ్ల పిక్కలను పట్టి తీవ్రంగా గాయపరించింది. అంతేకాదు అడిషనల్ కలెక్టర్ పెంపుడు కుక్కపై కూడా దాడి చేసింది. దీనితో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఐసీయూలో శ్రీనివాస్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇన్ని రోజులు సామాన్యులపై దాడి చేసిన కుక్కలు ఇప్పుడు ఏకంగా అడిషనల్ కలెక్టర్‌పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img