Monday, September 16, 2024

ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..

Must Read

అక్షర శక్తి గూడూరు: ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) గూడూరు మండల అధ్యక్షులు గుర్రపు యాకాంబ్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తొలిత తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు జర్నలిస్టులు ర్యాలీ కొనసాగింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ శ్వేతకు సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షులు గుర్రపు యాకాంబ్రం మాట్లాడుతూ.. గూడూరు ఏజెన్సీ మండలంలో వివిధ ఫ్రంట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూములు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలాల కేటాయింపు ఒకవేళ గూడూరు మండల కేంద్రంలో సాధ్యం కాకపోతే జిల్లా కేంద్రంలో కేటాయించుటకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏజెన్సీ మండలాల జర్నలిస్టులందరికీ ఉచిత కార్పొరేట్ వైద్యం అందించుటకు హెల్త్ కార్డులను జారీ చేయాలన్నారు. ఏజెన్సీ మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రవేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందించే విధంగా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) జిల్లా ఉపాధ్యక్షులు ముక్తవరం సత్యనారాయణ, కోరె పాపయ్య, మండల ప్రధాన కార్యదర్శి భూక్య మంగీలాల్ , కోశాధికారి కరుణాకర్ రెడ్డి, నాయకులు సురేష్, రాకేష్ యాదగిరి, నరసింహ, యాకన్న నరసింహ, బోడ రాజు, వెంకటేష్, నవనీత్, వీరస్వామి , వెంకటేష్ అజయ్, శ్రీనివాస్, సుమన్, సంతోష్, మోహన్, భీముడు , సంపత్, వెంకన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img