Monday, September 16, 2024

ముగ్గురు గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్

Must Read

అక్ష‌రశ‌క్తి వరంగల్: పోలీస్ కమిషనరేట్ పరిదిలోని కేయుసి పోలీస్ స్టేషన్ పరిధిలో కేయుసి పోలీస్ వారు 28/07/2024 వ రోజున ఎస్ఐ రాజ్ కుమార్ మరియు సిబ్బంది ఆయినా ఎండి. షబ్బీర్,శ్యామ్ రాజ్,రజిని కుమార్, మరియు సతీష్ కుమార్ లతో కలిసి ఓఆర్ఆర్ మీదుగా రెడ్డీపురం రోడ్డు వైపు పెట్రోలింగ్ చేయుటకు వెళ్లగా పెగడపల్లి గ్రామం వద్ద చెట్ల పొదల మధ్యలో ముగ్గురు యువకులు కూర్చుని గంజాయి సేవిస్తున్నారు. వెంటనే ఆ ముగ్గురిని పోలీస్ వారు పట్టుకోవడం జరిగింది. వెంటనే ఎస్ఐ రాజ్ కుమార్ ఆ ముగ్గురిని వారి వివరాలు అడగగా పుల్లూరి రాజేష్ r/o ఖానాపూర్, పపావత్ అనిల్ r/o రాగం పేట, ఖానాపూర్, ఆలువాల విపిన్ కుమార్ r/o ఎల్లాయి గూడెం చిన్నరావుపేట అని తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 50గ్రాముల ఎండు గంజాయి, 2మొబైల్ ఫోన్లు స్వాదినం చేసుకుని కేయుసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడమైనది. ఈ సందర్బంగా కేయుసి ఇన్స్పెక్టర్ సంజీవ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం గంజాయి మీద ఉక్కు పాదం మోపడం కోసం దానిని నివారించడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించడమే లక్ష్యం గా పోలీస్ వ్యవస్థ అహర్నిశలు కష్టపడుతుందని యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా అందరు గంజాయి నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపినిచ్చారు. ఈ కేసు దర్యాప్తు లో భాగమైన సిబ్బందిని కేయుసి ఇన్స్పెక్టర్ సంజీవ్ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img