వరంగల్ : ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ప్రముఖ నేపథ్య గాయని సునీత సందర్శించారు. కార్తీక మాసం విశిష్ట సోమవారం సందర్భంగా మిత్రులు, బంధువులతో కలిసి పాలంపేటలోని రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పర్యాటక గైడ్ వెంకటేష్ ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. అధ్బుతం శిల్ప నైపుణ్యం వున్న రామప్పను సందర్శించడం లో గొప్ప ఆధ్యాత్మికత, అలౌకిక ఆనందం వుంది అని సునీత అన్నారు.