Monday, June 17, 2024

ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వండి

Must Read
  • మైనార్టీ అధికారులను కోరిన హోం మంత్రి
    అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఉద్యోగాల భర్తీ కోసం ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వాల‌ని మైనార్టీ అధికారులను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ కోరారు. రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో సోమవారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉర్దూ బాష లో శిక్షణ ,సంబంధిత మెటీరియల్ తయారీ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పోటీ పరీక్షల్లో ఉర్దూ మెటీరియల్స్, స్టడీ సెంటర్ల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇదో సువర్ణావకాశమని.. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారని మార్కెట్‌లో ఇంగ్లీషు, తెలుగు కంటెంట్ పుష్కలంగా ఉందన్నారు. ఉర్దూ భాష కాబట్టి ఉర్దూ విద్యార్థులకు మెటీరియల్ అందించడం అనేది ఈ సమయంలో ముఖ్యమైన అవసరమని గుర్తు చేశారు. గ్రూపు 1, 2, 3 పరీక్షల్లో ఉర్దూ మెటీరియల్ అందించడం ఉర్దూ విద్యా ర్థులకు నిజమైన సేవలందించినట్లేన‌ని తెలిపారు. ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక స్టడీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. .విద్యార్థులు తమ ప్రాంతంలోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (DMWO)ని సంప్రదించడం ద్వారా లేదా హైదరాబాద్‌లోని మైనారిటీ అధ్యయన కేంద్రానికి కాల్ చేయడం ద్వారా తమ పేరును 23 మే వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23236112 నంబర్‌కు ఫోన్ చేసి పేరు, చిరునామా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎకె ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసిం, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి ఒమర్ జలీల్, ప్రొఫెసర్ ఎస్. ఎ.షాకుర్ , తెమ్రిస్ కార్యదర్శి షఫీ ఉల్ల్హ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img